సర్ఫరాజ్‌ ఖాన్‌, కోహ్లీ హాఫ్‌ సెంచరీ

https://www.teluguglobal.com/h-upload/2024/10/18/1370279-sarfaraz-khan-kohli.webp

2024-10-18 11:20:00.0

200 పరుగులు దాటిన భారత స్కోర్‌

 

న్యూజిలాండ్‌ తో మొదటి టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌ లో భారత బ్యాట్స్‌మన్లు నిలకడగా ఆడుతున్నారు. సర్ఫరాజ్‌ ఖాన్‌, విరాట్‌ కోహ్లీ ఆఫ్‌ సెంచరీలతో ఆదుకోవడంలో భారత స్కోర్‌ 200 పరుగుల మార్క్‌ దాటింది. న్యూజిలాండ్‌ కన్నా ఇంకా 152 పరుగులు వెనుకబడి ఉంది. సర్ఫరాజ్‌ ఖాన్‌ 57 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 61 పరుగులు, విరాట్‌ కోహ్లీ 79 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌ తో 53 పరుగులతో క్లీజ్‌ లో ఉన్నారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 63 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, సిక్స్‌ తో 52 పరుగులు చేసి పటేల్‌ బౌలింగ్‌ లో ఔటయ్యాడు. అంతకుముందే ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ 35 పరుగులు చేసి పటేల్‌ బౌలింగ్‌ లోనే ఔటయ్యారు. భారత జట్టు 42 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో పటేల్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.