https://www.teluguglobal.com/h-upload/2024/02/03/500x300_1294456-pain.webp
2024-02-03 15:10:16.0
నిద్రలో ఒక్కోసారి మెడ కండరాలు పట్టేయడం జరుగుతూ ఉంటుంది
నిద్రలో ఒక్కోసారి మెడ కండరాలు పట్టేయడం జరుగుతూ ఉంటుంది.. అయితే తరువాత దానికదే తగ్గిపోతుంది.. కానీ ఒక్కోసారి అలాంటి మెడ నొప్పే అనిపిస్తుంది కానీ అది తగ్గదు.. చాలా ఎక్కువగా అనిపిస్తుంది..కొందరైతే మెడ నొప్పి, భుజాలు, చేతులు నొప్పులు, వేళ్లు తిమ్మిరి, తలనొప్పి, మైకం మొదలైన లక్షణాలతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమస్యను సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. అయితే గతంలో ఈ సమస్యలు వయస్సును బట్టి వచ్చేవి. ముఖ్యంగా 60 ఏళ్లకు పైబడి వయసున్నవారిలో మాత్రమే కనపడేవీ. అయితే ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఈ వ్యాధి బయట పడుతోంది. కంప్యూటర్ ముందు ఎక్కువ గంటలు కూర్చోవడం, మెడని ఒక పొజిషన్ లోనే పెట్టి ఉంచడం వంటివన్నీ ఈ డిజార్డర్ కి కారణాలే.
తగ్గించుకోవాలంటే ..
సర్వికల్ స్పాండిలోసిస్ ఉన్నప్పుడు మెడ దగ్గర ఉండే మజిల్స్ స్టిఫ్ గా ఉంటాయి. అసలు ఫ్లెక్సిబిలిటీ ఉండదు. మెడని ఎటు పడితే అటు ఫ్రీ గా తిప్పలేం. అలాంటప్పుడు వేడి నీటి తో గానీ, చల్లని నీటి తో గానీ కాపడం పెట్టుకుంటే ఈ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. అప్పుడు ఆ ప్రాంతం లో వచ్చే నొప్పి తగ్గుతుంది.
జనరల్ గా ఎక్కడైనా వాపూ, నొప్పీ ఉందంటే అక్కడ మెడికేటెడ్ ఆయిల్స్ తో మసాజ్ చేస్తూ ఉంటాము. కానీ, సర్వికల్ స్పాండిలోసిస్ విషయం లో అలా చెయ్యకూడదు. ఎందుకంటే, ఏ కొంచెం ప్రెషర్ ఉన్నా సమస్య తీవ్రమౌతుంది. నొప్పిని దూరం చేయాలంటే కొన్ని నెక్ ఎక్సర్‌సైజ్‌లు అవసరమౌతాయి. అయితే మన సమస్య తీవ్రతని బట్టి, డాక్టర్ సలహా తో మాత్రమే ఇది జరగాలి
పడుకున్నా, కూర్చున్నా, చదువుకున్నా కంఫర్టబుల్ పొజిషన్ మెయింటెయిన్ చేయడం అవసరం. ల్యాప్‌టాప్, PC లేదా టాబ్లెట్‌లో దేనితో పని చేస్తున్నా చివరికి టీవీ చూస్తున్నప్పుడు కూడా ప్రతిదీ కంటి స్థాయిలో ఉండాలి. మెడను చాలాసార్లు పైకి లేదా క్రిందికి కదిలించే ఏదైనా కదలిక సర్వికల్ స్పాండిలోసిస్‌కి కారణం కావచ్చు. ఇవన్నీ పాటిస్తూ డాక్టర్ ను సంప్రదించి వీలైనంత త్వరగా సమస్యని పరిష్కరించే ప్రయత్నం చెయ్యచ్చు.
Lifestyle,Health,Health Care,Healthy Lifestyle,Spondylosis,Cervical spondylosis
Lifestyle, Health, Health Care, Healthy Lifestyle, Spondylosis, Cervical spondylosis
https://www.teluguglobal.com//health-life-style/to-reduce-cervical-spondylosis-996883