2025-02-14 15:55:06.0
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల గుడువును పొడిగిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు
తెలంగాణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. పాలకవర్గ గడువు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 904 సహకార సంఘాల కాలపరిమితి, 9 డీసీసీబీ ఛైర్మన్ల పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాలకవర్గ పదవీకాలానికి ఆరు నెలల ముందే ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. ఫిబ్రవరి 15 నాటికే గడువు ముగుస్తున్నా ఇంత వరకు రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.
ఈ నేపథ్యంలో సహకార సంఘాల పాలకవర్గ గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే లోకల్ బాడీ ఎన్నికల తరువాతే వీటికి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు దీనిని బట్టి తెలుస్తోంది. కాగా పదవీకాలం పొడిగిస్తూ జీవో జారీ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావుకు పాలక వర్గాలు, డీసీసీబీ చైర్మన్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Telangana Goverment,DCCB,Minister Tummala Nageswarao,Local body elections,PACS,Co-operative Societies