సాఫ్రాన్ కంపెనీ పెట్టుబడుల వెనక కేటీఆర్ అవిరళ కృషి..

2022-07-07 05:54:55.0

ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ భారత్ లో తమ విభాగాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం, అందులోనూ తెలంగాణను ఎంచుకోవడం ఆషామాషీ విషయం కాదు. కేవలం కంపెనీలను ఆహ్వానిస్తేనో, రాయితీలు ప్రకటిస్తేనో, మౌలిక వసతుల హామీ ఇస్తేనో ఇది సాధ్యం అవుతుందని అనుకోలేం. అంతకు మించి జరిగిన కృషి ఫలితమే తెలంగాణకు ‘సాఫ్రాన్’ కంపెనీ రావడం. తాజాగా శంషాబాద్‌లో ‘సాఫ్రాన్’ ఎయిర్‌ క్రాఫ్ట్ ఇంజిన్ సంస్థ మెగా ఏరో ఇంజిన్ (MRO) ఫెసిలిటీ సెంటర్ ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ […]

ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ భారత్ లో తమ విభాగాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం, అందులోనూ తెలంగాణను ఎంచుకోవడం ఆషామాషీ విషయం కాదు. కేవలం కంపెనీలను ఆహ్వానిస్తేనో, రాయితీలు ప్రకటిస్తేనో, మౌలిక వసతుల హామీ ఇస్తేనో ఇది సాధ్యం అవుతుందని అనుకోలేం.

అంతకు మించి జరిగిన కృషి ఫలితమే తెలంగాణకు ‘సాఫ్రాన్’ కంపెనీ రావడం. తాజాగా శంషాబాద్‌లో ‘సాఫ్రాన్’ ఎయిర్‌ క్రాఫ్ట్ ఇంజిన్ సంస్థ మెగా ఏరో ఇంజిన్ (MRO) ఫెసిలిటీ సెంటర్ ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.1200 కోట్ల రూపాయల పెట్టుబ‌డితో ఈ ఫెసిలిటీ సెంట‌ర్‌ ఏర్పాటు చేశారు. MRO ఫెసిలిటీ సెంట‌ర్ ద్వారా వెయ్యి మందికి ఉద్యోగ అవ‌కాశాలు ల‌భిస్తాయి.

పైకి కనపడేది 1200కోట్ల రూపాయల పెట్టుబడే అయినా.. దీని వల్ల మరిన్ని కంపెనీలు తెలంగాణకు రావడం సాధ్యపడుతుంది. అయితే సాఫ్రాన్ కంపెనీ MRO సెంటర్ ఏర్పాటు అంత సులభంగా సాధ్యపడలేదు.

హైదరాబాద్, ఢిల్లీ, ప్యారిస్ లో దీనికోసం 35 మీటింగ్స్ జరిగాయి, దాదాపు 400 మెయిల్స్ ఉత్తర ప్రత్యుత్తరాల రూపంలో అటు ఇటు వెళ్లాయి. దీని ఫలితమే ‘సాఫ్రాన్’ నాలుగు భారీ విభాగాలు తెంగాణకు రావడం.. అంటూ తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్.. కేటీఆర్ అవిరళ కృషిపై ట్వీట్ వేశారు.

ఇలాంటి పెట్టుబడుల సమయంలో సహజంగా ప్రజలంతా అక్కడ జరిగే కరచాలనాలను మాత్రమే చూడగలరని, కానీ దాని వెనక మంత్రి కేటీఆర్ శ్రమను వివరించి చెప్పారంటూ తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ రీట్వీట్ చేశారు.

పెట్టుబడిదారులే అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్లు..

‘సాఫ్రాన్’ కంపెనీకి సంబంధించి ఎలక్ట్రిక్ హార్నెస్, లీప్ ఇంజన్లు, MRO, IT సెంటర్ తెలంగాణలో ఏర్పాటవుతున్నాయి. వీటికి సంబంధించిన ఫెసిలిటీ సెంటర్ ని శంషాబాద్ లో తాజాగా ఏర్పాటు చేశారు. ఏవియేషన్ అండ్ డిఫెన్స్ రంగంలో పెట్టుబడులకి తెలంగాణ అనుకూలంగా ఉందన్న కేటీఆర్.. తెలంగాణలో ఏరోస్పేస్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.

పెట్టుబ‌డిదారులే తెలంగాణకు అతిపెద్ద బ్రాండ్ అంబాసిడ‌ర్ల‌ని సీఎం కేసీఆర్ అంటుంటార‌ని చెప్పారు మంత్రి కేటీఆర్. తెలంగాణ‌లో ప‌రిశ్ర‌మ‌ల కోసం అనువైన పాల‌సీ అమ‌లులో ఉందని చెప్పారు.

‘సాఫ్రాన్’ నిర్ణ‌యం హైద‌రాబాద్‌ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ఇత‌ర సంస్థ‌ల‌కు ప్రేర‌ణ‌గా నిలుస్తుంద‌న్నారు. వైమానిక రంగంలో కేంద్రం నుంచి తెలంగాణ‌కు అనేక అవార్డులు వ‌చ్చాయ‌ని తెలిపారు. ఆవిష్క‌ర‌ణ‌ల కోసం టీ హ‌బ్ వంటి ప్లాట్‌ ఫాంను అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

 

KTR,Telangana