2023-07-25 13:45:58.0
https://www.teluguglobal.com/h-upload/2023/07/25/800071-pan.webp
ప్రామాణికమైన విమర్శనా వ్యాసాలతో ఒక పుస్తకాన్ని ప్రచురించాలని ‘పాలపిట్ట బుక్స్’ సంస్థ సంకల్పించింది.
‘సంశోధన’ శీర్షికన ISBN నెంబర్‌తో ఈ వ్యాసాల పుస్తకం వెలువడుతుంది.
సాహిత్య విమర్శ, పరిశోధనలలో ఉన్నతమైన విలువలతో కూడిన వ్యాసాల్ని పరిశోధకులనించి, విమర్శకుల్నించి ఆహ్వానిస్తుంది. ఈ పుస్తకంలో అన్ని కొత్త వ్యాసాలు ఉంటాయి. అకాడమిక్ ప్రమాణాల్ని పాటిస్తూ వ్యాసాలు సమగ్రంగా, సరికొత్త ప్రతిపాదనలతో, విశ్లేషణలతో కూడినవై ఉండాలి.
నిబంధనలు:
– తెలుగు సాహిత్యంలోని విభిన్న ప్రక్రియల మీద రాయవచ్చు. కవిత, కథ, నవల, నాటకం, విమర్శ మొదలైన ప్రక్రియల గురించిన విశ్లేషణాత్మక వ్యాసాలై ఉండాలి.
– సాహిత్యంలోని భిన్న వాదాలు, ధోరణులు, వాటి ప్రభావాల గురించి వ్యాసాల్లో చర్చించవచ్చు.
– కవిత్వం కన్నా కథ, నవల, నాటకం, విమర్శ వంటి వచన ప్రక్రియల మీద రాసిన వ్యాసాలకు ప్రత్యేక ప్రాధాన్యం.
– భాషకు సంబంధించి చర్చించే వ్యాసాలకు కూడా ఈ పుస్తకంలో చోటు లభిస్తుంది. కనుక ఆదివాసీ భాషలు, వివిధ ప్రాంతాల మాండలికాలు, వాటిలో వస్తున్న సాహిత్యం తీరుతెన్నులకు సంబంధించిన వ్యాసాలు పంపించవచ్చు.
– వ్యాసాలు వ్యక్తుల మీద రాసినవై ఉండకూడదు. అంటే వారి జీవనరేఖలు, బయోడేటాలతో కూడినవై ఉండరాదు. వారి సాహిత్యం మీద విశ్లేషణలయితే పరవాలేదు.
– ఏ అంశం గురించి రాసినా స్పష్టత ఉండాలి. కొత్త అంశాలు చెప్పడానికి ప్రయత్నించాలి. నూతన ప్రతిపాదనలు చేస్తే మంచిది. స్టేట్‌మెంట్ల లాగా కాకుండా తాము చెప్పదలచుకున్న అంశాలకు తగిన సమర్థనలు చూపించాలి.
– అక్షరదోషాలు ఉండకూడు. వాక్యనిర్మాణంలో స్పష్టత తప్పనిసరి. పదస్వరూపం సరిగా ఉండాలి. వ్యాసాన్ని ఒకటికి నాలుగుసార్లు సరి చూసుకొని పంపించాలి.
– ఇదివరకు ఎక్కడా ప్రచురితం, ప్రసారితం కాలేదని, సోషల్‌మీడియా గ్రూపులలో పోస్టు చేయలేదని హామీపత్రం జత చేయాలి.
– వ్యాసంతో పాటు ఎంట్రీ ఫీజుగా రూ. 2000 పంపించాలి.
– ISBN నెంబర్‌తో ఈ ప్రత్యేక సంచిక రావడం వల్ల పరిశోధక విద్యార్థులకు భవిష్యత్తులో విషయపరంగా ఉపయోగకరంగా వుంటుంది.
– మీ వ్యాసాలని యూనికోడ్‌లో టైప్ చేసి వర్డ్‌ఫైల్ అండ్ పిడిఎఫ్ పంపించండి. లేదా అను 7 ఫాంట్స్‌లో టైప్ చేసి పంపించవచ్చు. ఇతర వివరాలకు సంప్రదించవలసిన సెల్ నెంబర్ – 9848787284
వ్యాసాలు పంపించాల్సిన చిరునామా: ఎడిటర్, పాలపిట్ట బుక్స్
ఫ్లాట్ నెం: 2, బ్లాక్-6, ఏపిహెచ్‌బి, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్-500044 ఫోనుః 94900 99327
email: palapittabooks@gmail.com
వ్యాసాలు పంపడానికి చివరి తేదీ: 24 ఆగస్టు 2023
అక్టోబర్ నెలలో కొడవటిగంటి కుటుంబరావు జయంతి సందర్భంగా ఈ పుస్తకం విడుదల అవుతుంది.
Essays in Telugu,Palapitta,ISBN