2025-02-06 10:32:04.0
మెట్టుగూడలో తల్లి, కొడుకుపై హత్యాయత్నం జరిగింది.
సికింద్రాబాద్ మెట్టుగూడలో తల్లి, కొడుకుపై హత్యాయత్నం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. గాయాలపాలైన తల్లి రేణుక, కుమారుడు యశ్వంత్‌ని చిలకలగూడ పోలీసులు.. గాంధీ ఆసుపత్రికి తరలించారు. బైక్‌పై వెళ్తుండగా ఐదుగురు దుండగులు విచక్షణారహితంగా దాడి చేశారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Secunderabad,Mettuguda,Attempted murder,Chilakalaguda Police,Crime news,Gandhi Hospital