సిద్దిపేట జిల్లాలో దారుణం .. మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం

https://www.teluguglobal.com/h-upload/2024/10/29/1373499-gang-rape.webp

2024-10-29 07:10:23.0

రెండు రోజుల కిందట జరిగిన ఈ దారుణ ఘటన. కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రకటన

సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకున్నది. హుస్నాబాద్‌ పట్టణంలో ఇంటిముందు ఆడుకుంటున్న మైనర్‌ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు రోజుల కిందట జరిగిన ఈ ఘటన గురించి బాలిక సోమవారం రాత్రి తన తల్లికి వివరించింది. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీను తెలిపారు. అత్యాచారం చేసిన ముగ్గురు యవకులు బాలిక ఉంటున్న కాలనీకి చెందినవారుగా గుర్తించినట్లు చెప్పారు. బాలికను వైద్య పరీక్షలకు పంపినట్లు సీఐ చెప్పారు. 

Gang rape,Minor girl,Siddipet district,Registration of case