సిద్ధరామయ్యకు బిగ్‌ రిలీఫ్‌

2025-02-07 05:58:37.0

ముడా కేసు సీబీఐకి అప్పగించేందుకు నో చెప్పిన హైకోర్టు

https://www.teluguglobal.com/h-upload/2025/02/07/1401159-siddaramaih.webp

మైసూర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) ఫ్లాట్ల కేటాయింపు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్యకు బిగ్‌ రిలీఫ్‌ దొరికింది. ఈ కేసు విచారణను సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్‌ ను కర్నాటక హైకోర్టు కొట్టివేసింది. కర్నాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఉంది కాబట్టి ముడా కేసు విచారణపై ప్రభావం చూపించే ఆస్కారముందని.. ఈ కేసు విచారణను సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ కర్నాటక హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం విచారించిన హైకోర్టు ధర్మాసనం విచారణను సీబీఐకి అప్పగించేందుకు నిరాకరించింది. పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో సిద్ధరామయ్యతో పాటు ఆయన వర్గీయులు ఊపిరి పీల్చుకున్నారు.

MUDA Scam,Karnataka CM,Siddaramaiah,CBI Inquiry,High Court