2024-12-16 10:44:10.0
https://www.teluguglobal.com/h-upload/2024/12/16/1386366-prabhas.webp
టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్ ఓ షూటింగ్‌లో ప్రభాస్‌కు గాయపడినట్లు తెలుస్తోంది
పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఓ మూవీ షూటింగ్ సందర్బంగా గాయపడ్డారు. సినిమా చిత్రీకరణ సమయంలో తన చీలమండ బెణికిందని ప్రభాస్ తెలిపారు. తాను నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం జపాన్ లో జనవరి 3న రిలీజ్ కానుందని, గాయం కారణంగా తాను ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడంలేదని క్లారిటీ ఇచ్చారు. గాయం కారణంగా డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలని సూచించారని వివరించారు. ప్రమోషన్ ఈవెంట్స్ లో డిస్ట్రిబ్యూటర్ల బృందం పాల్గొంటుందని తెలిపారు.
మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు, అభిమానాలకు ధన్యవాదాలు. జపాన్‌లోని అభిమానులని కలవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. కానీ మూవీ షూటింగ్‌లో నా కాలుకు గాయమైంది. దీంతో ఈ జపాన్‌కు రాలేకపోతున్న.. ఈ విషయంలో నన్ను క్షమించండి అంటూ ప్రభాస్ రాసుకోచ్చాడు కాగా, ప్రభాస్ కు గాయం కావడం పట్ల అభిమానులు స్పందిస్తున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
Pan India Hero Prabhas,injured,Kalki 2898 AD,Movie shooting,Tolley wood,distributors