సినీ రచయిత కులశేఖర్‌ కన్నుమూత

 

2024-11-26 12:13:07.0

https://www.teluguglobal.com/h-upload/2024/11/26/1381088-kulashekar.webp

కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న పాటల రచయిత

ప్రముఖ సినీ గేయ రచయిత కులశేఖర్‌ కన్నుమూశారు. ఆయనకు 52 సంవత్సరాలు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన సికింద్రాబాద్‌ లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చిత్రం, సంతోషం, నువ్వునేను, టెన్త్‌ క్లాస్‌, ఘర్షణ సహా వంద సినిమాలకు ఆయన పాటలు అందించారు. 2008 నుంచి ఆయన మోదడు సంబంధిత వ్యాధితో బాధ పడుతూ జ్ఞాపకశక్తి కోల్పోయాడు. అప్పటి నుంచి ఆయన భార్య ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ తన ఇద్దరు పిల్లలను పోషిస్తున్నారు.

 

Kulasekhar,Lyric Writer,Passed away