సిరిసిల్లలో మరో చేనేత కార్మికుడు ఆత్మహత్య

https://www.teluguglobal.com/h-upload/2024/11/13/1377358-erram-komuraiah.webp

2024-11-13 07:39:23.0

ఉపాధి సరిగా లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపిన కుటుంబ సభ్యులు

మరో నేత కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సిరిసిల్లలో ఎర్రం కొమురయ్య అనే చేనేత కార్మికుడు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. సిరిసిల్ల పట్టణంలోని గణేశ్‌నగర్‌ కు చెందిన కొమురయ్య నేత కార్మికుడుగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. గత పది నెలల కాలంలో సిరిసిల్లలో ఉపాధి సరిగా లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. మొత్తం రూ. 10 లక్షల వరకు అప్పులు కావడంతో వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు తెలిపారు. సిరిసిల్లోని అపెరల్‌ పార్క్‌ లో గల ఓనర్‌ టు వర్కర్‌ పని అమలుచేస్తే కార్మికులకు ఉపాధి దొరుకుతుందన్నారు. దీంతో ఇలాంటి ఆత్మహత్యలు పునరావృతం కావని చెబుతున్నారు.మృతునికి భార్య కమల, ఇద్దరు కొడుకులు శ్రీకాంత్, సాయి కిరణ్, కూతురు వరలక్మి ఉన్నారు. 

Another handloom worker,commits suicide,in Sirisilla,Lack of employment,Financial difficulties