2024-12-26 05:14:38.0
https://www.teluguglobal.com/h-upload/2024/12/26/1389178-cm-met-tollywood-celebrites.webp
అల్లు అర్జున్ అరెస్ట్ అనంతర పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం
సినీ ప్రముఖులతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సీఎంతో సమావేశం అయ్యారు. దాదాపు 50 మందికి పైగా సినీ ప్రముఖులు ఈ భేటీలో పాల్గొన్నారు.
వీరిలో అల్లు అరవింద్, నాగార్జున, వెంకటేశ్, సి. కల్యాణ్, నాగవంశీ, గోపీ ఆచంట, బీవీఎన్ ప్రసాద్, వంశీ పైడిపల్లి, నవీన్, రవిశంకర్, త్రివిక్రమ్, మురళీ మోహన్, హరీశ్ శంకర్, కొరటాల శివ, వశిష్ఠ, సాయి రాజేశ్, బోయపాటి శ్రీను, కిరణ్ అబ్బవరం తదితరులు ఉన్నారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ అనంతర పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. మరోవైపు ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, హోం శాఖ సెక్రటరీ రవి గుప్తా, డీజీపీ జితేందర్, చిక్కడపల్లి ఏసీపీ, డీసీపీలు ఈభేటీలో పాల్గొన్నారు. తాజా పరిణామాలు, సినీ పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపై సినీ ప్రముఖులు సీఎంతో చర్చిస్తున్నారు.
List of Telugu film industry,Celebrities,Meeting,CM Revanth . Command Control Center,Allu Arjun arrest,Stampede at Sandhya Theatre