సీఎం చంద్రబాబు వెంట మేమంతా నడుస్తాం

2024-10-19 06:14:51.0

రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ పనిచేస్తున్నదన్న లంకా దినకర్‌

https://www.teluguglobal.com/h-upload/2024/10/19/1370422-lanka-dinakar.webp

వైసీపీ ఐదేళ్ల పాలనలో కేంద్ర నిధులు పక్కదారి పట్టించారని బీజేపీ నేత లంకా దినకర్‌ విమర్శించారు. 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర సాధనకు అందరం ఐక్యంగా కృషి చేస్తామన్నారు. 20 సూత్రాలు అందరికీ తెలిసేలా అన్ని కలెక్టరేట్ల వద్ద ఉంచుతామన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్నిరకాలుగా రాష్ట్రానికి సహకారం అందిస్తున్నదని తెలిపారు. సీఎం చంద్రబాబు వెంట తామంతా నడుస్తామన్నారు. అర్హులైన అందరికీ పథకాలు అందించడానికి సీఎం కృషి చేస్తున్నారని వివరించారు. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ పనిచేస్తున్నదని లంకా దినకర్‌ తెలిపారు.