సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్

2025-01-09 10:57:14.0

సీఎం రేవంత్‌ రెడ్డి విదేశీ పర్యటనకు తెలంగాణ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.

సీఎం రేవంత్‌ రెడ్డి విదేశీ పర్యటనకు తెలంగాణ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. జనవరి 13 నుంచి 23 వరుకు దావోస్ పర్యటించేందుకు ముఖ్యమంత్రికి ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి తన పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటనకు పర్మిషన్ ఇవ్వాలని ఏసీబీ కోర్టును అభ్యర్థించారు. బ్రిస్బేన్, దావోస్, ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్ పర్యటనలకు వెళ్లాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఇందుకోసం ఆరు నెలల పాటు తన పాస్‌పోర్టు ఇవ్వాలని కోరారు. రేవంత్‌ రెడ్డి అభ్యర్థనను అంగీకరించిన న్యాయస్థానం.. జులై 6లోగా పాస్‌పోర్టును తిరిగి అప్పగించాలని ఆదేశించింది.

CM Revanth Reddy,ACB court,vote note case,foreign visit,Davos,Passport,Australia,Singapore,Switzerland,Telangana goverment,CS Shanthi kumari