సీఎం రేవంత్‌, మంత్రి కోమటిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు

https://www.teluguglobal.com/h-upload/2024/11/09/1376381-brs-complaint.webp

2024-11-09 15:22:51.0

బంజారాహిల్స్‌ ఠాణాలో కంప్లైంట్‌ చేసిన బీఆర్‌ఎస్‌ నాయకులు

సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూసీ ప్రక్షాళన పేరుతో మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ను అసభ్య పదజాలంతో దూషించారని, ముక్కలు, ముక్కలు చేస్తామని సీఎం, మంత్రి వ్యాఖ్యలు చేశారని బంజారాహిల్స్‌ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్‌ లో కోరారు. సీఎం, మంత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కంప్లైంట్‌ చేసిన వారిలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు దాసోజు శ్రవణ్‌, కిషోర్‌ గౌడ్‌, కడారి స్వామి యాదవ్‌, రఘురాం, రాజు తదితరులు ఉన్నారు.

Police complaint,CM Revanth Reddy,Minister Komatireddy Venkat Reddy,BRS,Banjara Hills Police,Balka Suman,Dasoju Sravan