2024-10-18 11:47:35.0
స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం అందజేత
తెలంగాణలోకి అదానీ గ్రూప్ సంస్థల ఎంట్రీ చివరి అంకానికి చేరింది. ఓల్డ్ సిటీలో ఎలక్ట్రిసిటీ బిల్స్ వసూళ్లు, రెగ్యులేషన్ బాధ్యతలు అదానీకి అప్పగిస్తామని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇతర రంగాల్లోనూ అదానీ గ్రూప్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. ఈక్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డితో అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ శుక్రవారం భేటీ అయ్యారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఫౌండేషన్ నుంచి రూ.100 కోట్ల విరాళం చెక్కు అందజేశారు. ఈ భేటీలో తెలంగాణలో పెట్టుబడులపై ముఖ్యమంత్రితో అదానీ చర్చించారు.
CM Revanth Reddy,Gautam Adani,Adani Group,Skill University,Old City Electricity Bills