2025-02-13 10:34:05.0
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గద్దె దించేందుకు 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు
సొంత కాంగ్రెస్ పార్టీ నేతలే సీఎం రేవంత్‌రెడ్డిని గద్దె దించేందుకు చూస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాట్ కామెంట్స్ చేశారు. దీని కోసం 25 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి ఓటమి భయంతోనే స్థానిక సంస్థ ఎన్నికలు వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 15 నెలల రేవంత్ పాలనలో అభివృద్ధి శూన్యమని.. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని బాంబు పేల్చారు.
పథకాల పేర్లు మార్చి ఎంతో అభివృద్ధి చేసినట్లుగా కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ లో రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యేలకు సమన్వయం కొరవడిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
CM Revanth Reddy,Errabelli Dayakar Rao,Congress party MLAs,BRS Party,KCR,KTR