సీజేఐగా రేపు జస్టిస్‌ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం

2024-11-10 07:20:49.0

రాష్ట్రపతి భవన్‌ లో ప్రమాణం చేయనున్న కొత్త చీఫ్‌ జస్టిస్‌

https://www.teluguglobal.com/h-upload/2024/11/10/1376494-cji-sanjeev-khanna.webp

చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియాగా జస్టిస్ సంజీవ్‌ ఖన్నా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పదవీకాలం ఆదివారంతో ముగియనుంది. సోమవారం సుప్రీం కోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్‌ కన్నా ఉదయం రాష్ట్రపతి భవన్‌ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత సుప్రీం కోర్టుకు చేరుకొని చీఫ్‌ జస్టిస్‌ హోదాలో కేసులు విచారిస్తారు. సంజీవ్‌ ఖన్నా లోధి గార్డెన్‌ లో రోజు మార్నింగ్‌ వాక్‌ చేసేవారు. ఇప్పుడు చీఫ్‌ జస్టిస్‌ గా నియమితులు కావడంతో భద్రత కారణాల దృష్ట్యా మార్నింగ్‌ వాక్‌ వదిలేకున్నారు.

Justice Sanjeev Khanna,CJI,Take Oath Tomorrow,Rastrapathi Bhavan,Droupadi Murmu