2024-12-24 15:46:37.0
సంజయ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏసీబీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం
https://www.teluguglobal.com/h-upload/2024/12/24/1388766-sanjay.webp
సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్. సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదైంది. గత ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖ డీజీ, సీఐడీ విభాగాధిపతిగా పనిచేసిన సంజయ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై ఏసీబీ విచారణకు ఆదేశించింది. దీనిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏసీబీ అధికారులు లేఖ రాశారు. సీఎస్ నుంచి అనుమతి లభించడంతో సంజయ్‌పై కేసు నమోదైంది. ఏ1గా సంజయ్, ఏ2గా సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్‌ఫ్రా, ఏ3గా క్రిత్వ్యాప్ టెక్నాలజీస్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.