సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జాన్‌ వెస్లీ

2025-01-28 13:42:30.0

పార్టీ చరిత్రలోనే దళితుడికి టాప్‌ పోస్టు

సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జాన్‌ వెస్లీ ఎన్నికయ్యారు. సంగారెడ్డిలో నిర్వహిస్తున్న సీపీఎం నాలుగో రాష్ట్ర మహాసభల్లో భాగంగా కొత్త ప్రధాన కార్యదర్శితో పాటు రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా అమరచింతకు చెందిన జాన్‌ వెస్లీ డీవైఎఫ్‌ఐ, కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు. సీపీఎం పార్టీ చరిత్రలోనే మొదటిసారిగా పార్టీ రాష్ట్ర కమిటీలో అత్యున్నత పదవిని దక్కించుకున్న మొదటి వ్యక్తిగా జాన్‌ వెస్లీ చరిత్ర సృష్టించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి తమ్మినేని వీరభద్రం ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో కొత్త ప్రధాన కార్యదర్శిగా జాన్‌ వెస్లీ ఎన్నికయ్యారు.

CPM,Telangana,New General Secretary,John Wesley,Fist SC Leader