2024-12-07 08:30:59.0
కడపలో ఇంత నీటి సమస్య ఉందని నేను అనుకోలేదన్న ఏపీ డిప్యూటీ సీఎం
https://www.teluguglobal.com/h-upload/2024/12/07/1384083-pawan.webp
చదువుల నేల రాయలసీమకు తానొచ్చానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కడప మున్సిపల్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2014-19 మధ్యకాలంలో ఉద్దానం సమస్యను బైటికి తీసుకొచ్చాను. నాటి సీఎం చంద్రబాబు రూ. 61 కోట్లతో ఉద్దానం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారు. అత్యధిక లైబ్రరీలు ఉన్న ప్రాంతం రాయలసీమ అన్నారు. అన్నమయ్య, వేమన, పుట్టపర్తి నారాయణ చార్యులు వంటి మహనీయుల నేల ఇది అన్నారు. రాయలసీమ అంటే అభివృద్ధికి వెనుకబాటు కాదు.. అవకాశాలకు ముందుండి నడిచే ప్రాంతం కావాలన్నారు.కడపలో ఇంత నీటి సమస్య ఉందని నేను అనుకోలేదన్నారు. పులివెందుల తాగునీటి ప్రాజెక్టుకు రూ. 45 కోట్లు ఇచ్చామన్నారు. నీటి సమస్య తీర్చి ఇక్కడి ప్రజలను ఆదుకుంటానని మాట ఇస్తున్నానని పవన్ చెప్పారు.