సీరియల్ నటికి వేధింపులు.. నిందితుడు అరెస్ట్

https://www.teluguglobal.com/h-upload/2025/01/02/1391116-arrest.webp

2025-01-02 14:49:22.0

టీవీ సీరియల్ నటిని వేధిస్తున్న వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

టీవీ సీరియల్ నటిని వేధిస్తున్న వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన 29 ఏళ్ల మహిళ యూసుఫ్‌గూడ ప్రాంతంలో తన పిల్లలతో కలిసి ఉంటోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఓ సీరియల్‌లో చేస్తున్న సమయంలో ఫణితేజ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా మారింది. పెళ్లి చేసుకుంటానని రెండు నెలల క్రితం అతను చెప్పాడు. ఆమె మాత్రం తనకు పెళ్లయిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పి పెళ్లికి నిరాకరించింది. వివాహానికి నిరాకరించిందన్న కోపంతో ఆరోజు నుంచి నిందితుడు ఆమెను ప్రేమ, పెళ్లి పేరుతో వేధించసాగాడు.

అసభ్యకర సందేశాలు, వీడియోలు వాట్సాప్ ద్వారా పంపిస్తూ వేధించాడు.బాధితురాలి అత్త ఇంటి చిరునామా తెలుసుకొని అక్కడకు వెళ్లి ఆమె గురించి చెడుగా చెప్పాడు. అతని వేధింపులు భరించలేక బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలియడంతో అతను ఆమెకు ఓ సెల్ఫీ వీడియోను పంపించాడు. తన వల్లే ఇదంతా జరిగిందని సారీ అని అందులో పేర్కొన్నాడు. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

TV serial actress,Accused arrested,Jubilee Hills Police,West Godavari District,Phani Teja,Yusufguda,Harassment,Crime news