2016-05-21 04:36:38.0
సిబిఎస్సి పన్నెండవ తరగతి పరీక్షా ఫలితాల్లో అమ్మాయిలు విజయఢంకా మోగించారు. అమ్మాయిలు 88.58శాతం ఉత్తీర్ణత సాధించగా, అబ్బాయిలు 78.85 శాతం మంది పాసయ్యారు. శనివారం ఈ ఫలితాలు వెల్లడించారు. ఢిల్లీలోని మాంట్ఫార్ట్ స్కూల్లో చదివిన సుకృతి గుప్తా 500 మార్కులకు 497 మార్కులు తెచ్చుకుని, ప్రథమ స్థానంలో నిలిచింది. తాను సొంతంగా చదువుకున్నట్టుగా, ఎన్‌సిఇఆర్‌టి ప్రచురించిన పుస్తకాలను చదివినట్టుగా సుకృతి తెలిపింది. తాను పరీక్షలు బాగా రాసినా, ఇన్ని మార్కులు వస్తాయని ఊహించ లేదంటూ ఆమె తన […]
http://www.teluguglobal.com/wp-content/uploads/2016/05/CBSE.gif
సిబిఎస్సి పన్నెండవ తరగతి పరీక్షా ఫలితాల్లో అమ్మాయిలు విజయఢంకా మోగించారు. అమ్మాయిలు 88.58శాతం ఉత్తీర్ణత సాధించగా, అబ్బాయిలు 78.85 శాతం మంది పాసయ్యారు. శనివారం ఈ ఫలితాలు వెల్లడించారు. ఢిల్లీలోని మాంట్ఫార్ట్ స్కూల్లో చదివిన సుకృతి గుప్తా 500 మార్కులకు 497 మార్కులు తెచ్చుకుని, ప్రథమ స్థానంలో నిలిచింది. తాను సొంతంగా చదువుకున్నట్టుగా, ఎన్‌సిఇఆర్‌టి ప్రచురించిన పుస్తకాలను చదివినట్టుగా సుకృతి తెలిపింది. తాను పరీక్షలు బాగా రాసినా, ఇన్ని మార్కులు వస్తాయని ఊహించ లేదంటూ ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. సుకృతికి ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో నూటికి నూరు మార్కులు రాగా ఇంగ్లీషు, లెక్కలు, కంప్యూటర్ సైన్స్ల్లో 99 మార్కులు వచ్చాయి. బేసిక్స్లో బలంగా ఉంటే తరువాత చదువులో ఎలాంటి సమస్యలు ఉండవని ఆమె తెలిపింది.