సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్‌

2025-01-07 13:51:50.0

తన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో కేటీఆర్‌ పిటిషన్‌

ఫార్ములా ఈ-రేస్‌ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను మంగళవారం తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఆయన సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. కేటీఆర్‌ తరఫున న్యాయవాది మోహిత్‌ రావు ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో పిటిషన్‌ వేశారు.ఈ కేసులో కేటీఆర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనను కూడా వినాలని ముందస్తుగానే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే. 

KTR,Approach,Supreme Court,Formula E race case,ACB,High Court dismiss,Quash petition