సెమీస్‌కు దక్షిణాఫ్రికా..ఇంగ్లాండ్‌పై ఘన విజయం

2025-03-01 15:21:30.0

ఇంగ్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు కేవలం 179 పరుగులకే కుప్ప కూలింది. 180 పరుగుల లక్ష్యాన్ని 29.1 ఓవర్లలో సౌత్ ఆఫ్రికా ఛేదించింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ రిక్లెటన్ 27, స్టబ్స్ డకౌట్ అయ్యాడు. వాండర్ డసెన్ 72, క్లాసెన్ 64 కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివరిలో డేవిడ్ మిల్లర్ (07) సిక్స్ తో ఫినిషింగ్ చేశాడు.5 పాయింట్లతో గ్రూప్‌ బిలో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికా. సెమీస్‌లో తలపడనున్న భారత్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు నిలిచాయి

South Africa,England,Rickleton,Living stun,Harry Brooke,Rabada,India,New Zealand,Australia,ICC Champions Trophy,ICCI