https://www.teluguglobal.com/h-upload/2024/01/11/500x300_1172862-ice-bath-benefits.webp
2024-01-12 10:38:54.0
గడ్డలు కట్టినట్టు ఉన్న మంచు నీళ్లతో దూకడం లేదా ఐస్ ముక్కలు వేసిన టబ్‌లో స్నానం చేసే ట్రెండ్ ఇటీవల ఎక్కువైంది. ముఖ్యంగా సెలబ్రిటీలు ఈ ట్రెండ్ ఎక్కువగా ఫాలో అవుతున్నారు.
గడ్డలు కట్టినట్టు ఉన్న మంచు నీళ్లతో దూకడం లేదా ఐస్ ముక్కలు వేసిన టబ్‌లో స్నానం చేసే ట్రెండ్ ఇటీవల ఎక్కువైంది. ముఖ్యంగా సెలబ్రిటీలు ఈ ట్రెండ్ ఎక్కువగా ఫాలో అవుతున్నారు. దీన్నే ఐస్ బాత్/ కోల్డ్ వాటర్ థెరపీ అంటున్నారు. ఈ తరహా స్నానంతో ఉన్న లాభాలు, నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఐస్ బాత్‌తో నష్టాల కంటే లాభాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ఇది కండరాల ఆరోగ్యాన్ని, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్తున్నారు. దీంతో ఉన్న లాభాలేంటంటే..
ఐస్ బాత్ వల్ల కండరాలు ఇన్‌స్టంట్ రిలీఫ్ పొందుతాయి. కండరాల నొప్పులు తగ్గుతాయి. రక్తనాళాలు, కండరాలు కుచించుకు పోవడం వల్ల వాపు వంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.
ఐస్ బాత్ వల్ల రక్తప్రసరణ వేగవంతం అవుతుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది. అవయవాలకు ఆక్సిజన్ అందే రేటు పెరుగుతుంది. దీనివల్ల ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది.
ఐస్ బాత్ వల్ల మెదడులోని నాడీ వ్యవస్థ ఒక్కసారిగా ఉత్తేజితం అవుతుంది. ఇది ఒత్తిడి నుంచి ఇన్‌స్టంట్ రిలీఫ్ ఇవ్వగలదు. నిద్రలేమి సమస్యలను తగ్గించడంలోనూ ఇది సాయపడుతుంది.
ఐస్ నీటిలో స్నానం చేయడం వల్ల ఇంఫ్లమేషన్ తగ్గుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఐస్ నీటిలో స్నానం చేయడం వల్ల చర్మం బిగుతుగా తయారవుతుంది. జిడ్డు చర్మాన్ని ప్రేరేపించే సెబమ్ ఉత్పత్తి తగ్గుతుంది.
ఇక ఐస్ బాత్‌తో ఉండే నష్టాలేంటంటే.. ఉన్నట్టుండి గడ్డకట్టే నీటిలో దూకడం లేదా స్నానం చేయడం వల్ల కొన్ని సార్లు రక్తపోటు అమాంతం పెరగొచ్చు. అందుకే హైబీపీ సమస్య ఉన్నవాళ్లు మరీ చల్లగా ఉన్న నీటితో ఐస్ బాత్ చేయకూడదు.
ఐస్ నీళ్లలో ఎక్కువసేపు గడపడం వల్ల కొంతమందికి స్కిన్ ఎలర్జీలు కలగొచ్చు. కాబట్టి కొంతసేపు మాత్రమే ఐస్ బాత్ చేయాలి. అలాగే నాడీ సంబంధిత సమస్యలు, దీర్ఘకాలిక తలనొప్పి వంటివి ఉన్నవాళ్లు గడ్డకట్టే నీటితో స్నానం చేయకపోవడమే మంచిది.
ice bath benefits,Health,ice baths,Health Benefits
ice bath benefits, Health, Health tips, Telugu News, Telugu Global News, News, ice bath benefits for skin, ice bath health benefits, health benefits, ఐస్ బాత్
https://www.teluguglobal.com//health-life-style/ice-bath-health-benefits-how-good-or-bad-are-ice-baths-popularised-by-celebs-989014