2016-07-06 06:38:28.0
ఇంకా…ఇంకా పర్‌ఫెక్టుగా సెల్ఫీ రావాలని తెగ తాపత్రయపడుతూ శరీరాన్ని, మోచేతిని అటు ఇటు వంచేస్తుంటారు చాలామంది. అలా చేసేవారికి సెల్పీ ఎల్బో ముప్పుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. సెల్ఫీలు తీసుకుంటున్నపుడు మోచేతిపై పడే ఒత్తిడి కారణంగా అదొక ఆరోగ్య సమస్యగా మారుతుందని అమెరికాకు చెందిన కండరాలు, ఎముకల వ్యాధుల నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు సెల్ఫీ స్టిక్తో సెల్ఫీలు తీసుకుంటున్నవారికి కూడా ఈ ముప్పు తప్పదంటున్నారు. టెన్నిస్, గోల్ఫ్ ఆడేవారికి ఎలాగయితే మోచేతి సమస్యలు వస్తాయో ఇదీ అలాంటిదేనని చెబుతున్నారు. […]
ఇంకా…ఇంకా పర్‌ఫెక్టుగా సెల్ఫీ రావాలని తెగ తాపత్రయపడుతూ శరీరాన్ని, మోచేతిని అటు ఇటు వంచేస్తుంటారు చాలామంది. అలా చేసేవారికి సెల్పీ ఎల్బో ముప్పుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. సెల్ఫీలు తీసుకుంటున్నపుడు మోచేతిపై పడే ఒత్తిడి కారణంగా అదొక ఆరోగ్య సమస్యగా మారుతుందని అమెరికాకు చెందిన కండరాలు, ఎముకల వ్యాధుల నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు సెల్ఫీ స్టిక్తో సెల్ఫీలు తీసుకుంటున్నవారికి కూడా ఈ ముప్పు తప్పదంటున్నారు.
టెన్నిస్, గోల్ఫ్ ఆడేవారికి ఎలాగయితే మోచేతి సమస్యలు వస్తాయో ఇదీ అలాంటిదేనని చెబుతున్నారు. టెక్నాలజీని అతిగా వాడే క్రమంలో వచ్చే సమస్యల్లో ఇదీ ఒకటని వారు పేర్కొన్నారు. సెల్ఫీలు మరీ ఎక్కువగా తీసుకుంటున్నపుడు కండరాల మీద ఒత్తిడి పడి మోచేతి ప్రాంతమంతా వాపుకి గురవుతుందంటున్నారు. ఫోన్లలో ఆటలు, చాటింగ్, ట్వీట్లు, సెల్ఫీలు… ఇవన్నీ ఇంతకుముందు కంటే ఎక్కువగా టీనేజర్లను గాయపరుస్తున్నట్టుగా గుర్తించారు. అమెరికాలోని న్యూయార్క్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ ఫార్మసీలోని వైద్యులు ఈ వివరాలను వెల్లడించారు.
https://www.teluguglobal.com//2016/07/06/సెల్ఫీతో-మోచేతికి-ముప్ప/