సెల్ఫీ విత్‌ కాళేశ్వరం నీళ్లు

2025-02-01 10:05:06.0

రంగనాయక సాగర్‌ ఎడమ కాలువ వద్ద నీటితో హరీశ్‌ రావు సెల్ఫీ

సిద్దిపేట జిల్లాలో ప్రవహిస్తోన్న కాళేశ్వరం నీళ్లను చూసి మాజీ మంత్రి హరీశ్‌ రావు ఉప్పొంగిపోయారు. శనివారం తన నియోజకవర్గంలో పర్యటిస్తోన్న హరీశ్‌ రావు సిద్దిపేట రూరల్‌ మండలం పుల్లూరు గ్రామంలోని రంగనాయకసాగర్‌ వద్ద ప్రవహిస్తోన్న రంగనాయకసాగర్‌ కాల్వ దగ్గర ఆగారు. కాల్వలో ప్రవహిస్తోన్న గోదావరి నీళ్లను చూసి సంతోషంగా పార్టీ నాయకులతో కలిసి సెల్ఫీలు దిగారు. ఇది జలానందమని.. ఈ ప్రాంతానికి గోదావరి నీళ్లు రావడం కాళేశ్వరం ప్రాజెక్టుకు సజీవ సాక్ష్యమని పేర్కొన్నారు.

Kaleshwaram Project,Ranganayaka Sagar,Siddipet,Harish Rao,Selfie with Water