https://www.teluguglobal.com/h-upload/old_images/500x300_127205-selfie-health-problems.webp
2018-12-31 19:02:23.0
ఇప్పుడంతా సెల్ఫీల ట్రెండ్ నడుస్తోంది. సెల్ఫీలు దిగాలి…. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయాలి…. లైకులు, కామెంట్లు చూసి మురిసిపోవాలి. దీనికోసం ఎంతటి ప్రమాదానైనా లెక్క చేయడం లేదు యువత. సరదా కోసం దిగే సెల్ఫీలు…. ప్రమాదాల్ని తెచ్చిపెట్టిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. విచిత్రమైన ఫోజుల కోసం ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్లు ఉన్నారు. అంతేకాదు సెల్ఫీ మరణాల్లో భారత్ టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. అయితే ఎలాంటి ప్రమాదం లేకుండా సేఫ్ గా సెల్ఫీలు దిగామని కొందరు […]
ఇప్పుడంతా సెల్ఫీల ట్రెండ్ నడుస్తోంది. సెల్ఫీలు దిగాలి…. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయాలి…. లైకులు, కామెంట్లు చూసి మురిసిపోవాలి. దీనికోసం ఎంతటి ప్రమాదానైనా లెక్క చేయడం లేదు యువత.
సరదా కోసం దిగే సెల్ఫీలు…. ప్రమాదాల్ని తెచ్చిపెట్టిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. విచిత్రమైన ఫోజుల కోసం ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్లు ఉన్నారు. అంతేకాదు సెల్ఫీ మరణాల్లో భారత్ టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. అయితే ఎలాంటి ప్రమాదం లేకుండా సేఫ్ గా సెల్ఫీలు దిగామని కొందరు ఫీలవుతుంటారు. కానీ ఇప్పుడు సెల్ఫీ కొత్త నొప్పులు గిఫ్ట్ గా ఇస్తోంది.
సెల్ఫీ తీసుకునేందుకు ఎక్కువ సమయం సెల్ ఫోన్‌ను పట్టుకోవడం వల్ల మణికట్టులో సమస్య తలెత్తుతుంది. ఇది కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ కి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మణికట్టులో తీవ్రమైన నొప్పితో పాటు జలదరించినట్లు అనిపించడం ఈ సిండ్రోమ్ లక్షణాలు. ఇలాంటి కేసుల సంఖ్య ఈ మధ్య బాగా పెరిగిపోయాయని వైద్యులు చెబుతున్నారు.
ఇదొక్కటే కారణం కాదు.. సెల్ఫీల కోసం ఎత్తైన ప్రాంతాలను ఎక్కడం, ఫోజుల కోసం దూకడం, స్టంట్లు చేస్తుంటారు. వీటి ప్రభావం కూడా శరీరంలోని ఎముకలపై పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే సెల్ఫీపై మోజును వీలైనంత తగ్గించుకుంటే మంచిదంటున్నారు వైద్యులు. ఈ మేరకు పూర్తి నివేదిక ఐరిష్ మెడికల్ జర్నల్‌లో ఈ మధ్యే ప్రచురితమైంది.
ఇదిలా ఉంటే ఈ ఏడాదిలోనూ సెల్ఫీ మరణాలు అధికంగానే నమోదు అయినట్లు ఓ సర్వే వెల్లడించింది. ఎక్కువ కేసులు అమెరికా, భారత్ , రష్యా, పాకిస్తాన్ లో నమోదు అయ్యాయట.
health problems,Problems,Selfie,selfie health,selfie health problems
https://www.teluguglobal.com//2019/01/01/selfie-health-problems/