http://www.teluguglobal.com/wp-content/uploads/2016/02/mobile-tamparing.png
2016-06-15 22:34:50.0
సెల్ఫోన్లను మరీ ఎక్కువగా వాడటం వలన పురుషుల్లో సంతానోత్పత్తి సామర్ధ్యం తగ్గిపోతుందని ఎప్పటినుండో వినబడుతున్నదే. ఇప్పుడు ఆ దృష్టాంతరాలు మరీ ఎక్కువగా ఆధారాలతో సహా కనబడుతున్నాయి. మారుతున్న జీవన శైలి, పనిఒత్తిడి, స్మార్ట్ ఫోన్ల వాడకం…అన్నీ కలిసి భారతీయ పురుషుల్లో సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని తగ్గించివేస్తున్నాయని వైద్యులు అంటున్నారు. 31-40 సంవత్సరాల మధ్య వయసున్న భారతీయ పురుషుల్లో వంధ్యత్వం పెరుగుతున్నదని, ఏడాదిపాటు దాంపత్య జీవితం గడిపినా తండ్రి కాలేని స్థితి వారిలో స్థిరంగా పెరుగుతున్నదని, పిల్లలు కావాలంటే వైద్యులను […]
సెల్ఫోన్లను మరీ ఎక్కువగా వాడటం వలన పురుషుల్లో సంతానోత్పత్తి సామర్ధ్యం తగ్గిపోతుందని ఎప్పటినుండో వినబడుతున్నదే. ఇప్పుడు ఆ దృష్టాంతరాలు మరీ ఎక్కువగా ఆధారాలతో సహా కనబడుతున్నాయి. మారుతున్న జీవన శైలి, పనిఒత్తిడి, స్మార్ట్ ఫోన్ల వాడకం…అన్నీ కలిసి భారతీయ పురుషుల్లో సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని తగ్గించివేస్తున్నాయని వైద్యులు అంటున్నారు.
31-40 సంవత్సరాల మధ్య వయసున్న భారతీయ పురుషుల్లో వంధ్యత్వం పెరుగుతున్నదని, ఏడాదిపాటు దాంపత్య జీవితం గడిపినా తండ్రి కాలేని స్థితి వారిలో స్థిరంగా పెరుగుతున్నదని, పిల్లలు కావాలంటే వైద్యులను సంప్రదించాల్సిన స్థితిలో దాదాపు సగం జనాభా ఉన్నదని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. సంతానం లేకపోతే మహిళలనే నిందిస్తారని, కానీ పురుషుల్లో కూడా లోపాలు ఎక్కువే ఉంటాయని, ముఖ్యంగా మగవారిలో వీర్యకణాలు తగ్గిపోవటం అనే సమస్య ఎక్కువగా కనబడుతున్నదని వారు చెబుతున్నారు.
30శాతం కేసుల్లో పురుషులే సంతానలేమికి కారణంగా ఉంటున్నారని సొసైటీ ఫర్ ది స్టడీ ఆఫ్ మేల్ రీప్రొడక్షన్ అనే సంస్థ పేర్కొంది. మగవారిలో వంధ్యత్వం పెరిగిపోతున్న నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్ నాయకుడు ప్రవీణ్ తొగాడియా, ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. లైంగిక పటుత్వాన్ని పెంచే మందుని తాను తయారుచేశానని, 600రూ.ల విలువైన ఆ మందుని 500రూ.లకే అందించాలనుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. మగతనాన్ని కాపాడుకోమనే అర్థం వచ్చేలా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
https://www.teluguglobal.com//2016/06/16/సెల్‌ఫోన్లు-స్పెర్మ్‌న/