సేవ చేస్తూనే సవాళ్లూ ఎదుర్కొంటున్నా- గవర్నర్

2022-06-02 00:37:50.0

తెలంగాణలో కొంతకాలంగా ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య కూడా కోల్డ్ వార్ నడుస్తోంది. బీజేపీకి రాజకీయంగా మేలు చేసేలా గవర్నర్‌ తమిళసై వ్యవహరిస్తున్నారన్నది అధికార పార్టీ ఆరోపణ. ఇటీవల గవర్నర్ ప్రసంగం కూడా లేకుండానే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించారు. ఈ గ్యాప్‌ ప్రభావం రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లోనూ స్పష్టంగా కనిపించింది. గవర్నర్ తమిళసై రాజ్‌భవన్‌లో సాదాసీదాగా రాష్ట్ర ఆవిర్భావ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి అధికార యంత్రాంగం నుంచి కూడా ఎవరూ పెద్దగా హాజరుకాలేదు. ఈ సందర్బంగా ప్రసంగించిన గవర్నర్‌… […]

తెలంగాణలో కొంతకాలంగా ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య కూడా కోల్డ్ వార్ నడుస్తోంది. బీజేపీకి రాజకీయంగా మేలు చేసేలా గవర్నర్‌ తమిళసై వ్యవహరిస్తున్నారన్నది అధికార పార్టీ ఆరోపణ. ఇటీవల గవర్నర్ ప్రసంగం కూడా లేకుండానే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించారు. ఈ గ్యాప్‌ ప్రభావం రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లోనూ స్పష్టంగా కనిపించింది.

గవర్నర్ తమిళసై రాజ్‌భవన్‌లో సాదాసీదాగా రాష్ట్ర ఆవిర్భావ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి అధికార యంత్రాంగం నుంచి కూడా ఎవరూ పెద్దగా హాజరుకాలేదు. ఈ సందర్బంగా ప్రసంగించిన గవర్నర్‌… రాష్ట్రానికి తాను సేవ చేస్తూనే, అదే సమయంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నానని చెప్పారు. కానీ తానేమీ బాధపడడం లేదన్నారు.

తెలంగాణ ప్రజలకు తన సేవలను అందిస్తూనే ఉంటానని చెప్పారు. ఎందరో త్యాగధనుల త్యాగ ఫలితమే నేటి స్వేచ్చ తెలంగాణ అన్నారు.

ప్రధాని, రాష్ట్రపతిలు తెలంగాణ ప్రజలకు సేవ చేసేందుకు తనకు గవర్నర్‌గా అవకాశం కల్పించారని.. తాను కూడా ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నానని తమిళసై చెప్పారు.

ALSO READ : తెలంగాణలో ‘త్రిపుర’ ఫార్ములా !

 

Tamilsai,Telangana,Telangana as a Governor,Telangana is the result of the sacrifices