https://www.teluguglobal.com/h-upload/2023/07/13/500x300_794655-sinus-problems.webp
2023-07-13 06:31:21.0
వాతావరణం చల్లగా మారేకొద్దీ జలుబు, దగ్గు లాంటివి మొదలవుతుంటాయి చాలామందికి. వీటిని సీజన్‌లో వచ్చిపోయే చిన్నపాటి సమస్యలు అనుకుని వదిలేస్తుంటారు. అయితే జలుబు, దగ్గు, తుమ్ములు ఎన్నిరోజులైనా తగ్గకపోతే అది సైనసైటిస్కి దారి తీయొచ్చు.
వాతావరణం చల్లగా మారేకొద్దీ జలుబు, దగ్గు లాంటివి మొదలవుతుంటాయి చాలామందికి. వీటిని సీజన్‌లో వచ్చిపోయే చిన్నపాటి సమస్యలు అనుకుని వదిలేస్తుంటారు. అయితే జలుబు, దగ్గు, తుమ్ములు ఎన్నిరోజులైనా తగ్గకపోతే అది సైనసైటిస్కి దారి తీయొచ్చు. ఈ సీజన్‌లో సైనసైటిస్ బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
ముఖంలో ఉండే సైనసిస్ అనే గాలి గదుల్లో వచ్చే ఇన్ఫెక్షన్‌ను సైనసైటిస్ అంటారు. ఈ సైనసిస్‌లు కళ్లకు మధ్యలో రెండు, బుగ్గల దగ్గర రెండు , నుదుటి వెనుక రెండు, మెదడు భాగంలో మరో రెండు ఉంటాయి. ఈ ఎనిమిది సైనసిస్ గదులన్నీ గాలితో నిండి ఉంటాయి. ఇవి పీల్చేగాలిని రెగ్యులేట్ చేస్తాయి. తీసుకునే గాలిని శరీరం టెంపరేచర్‌కు తగ్గట్టు వేడిగా, తేమగా ఉండేలా చేస్తాయి. ఈ సైనస్ గదులకు గాయమైనా, ఇన్ఫెక్షన్ సోకినా దాన్ని సైనసైటిస్ అంటారు. చల్లని గాలి, దుమ్ము, ధూళి, కాస్మొటిక్స్, పొల్యూషన్ వల్ల వాతావరణంలో రిలీజ్ అయ్యే కెమికల్స్, పెట్స్, స్విమ్మింగ్ పూల్ వాటర్‌లో ఉండే క్లోరిన్.. ఇలా రకరకాల అలర్జీలు సైనసైటిస్ రిస్క్‌ని పెంచుతాయి. దీంతోపాటు వైరస్, బ్యాక్టీరియా లేదా ఫంగస్ వల్ల కూడా సైనస్ రావొచ్చు.
సైనస్ గదులన్నీ ముక్కుతో కనెక్ట్ అయి ఉంటాయి. అందుకే సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ముందుగా ముక్కు పట్టేస్తుంది. కొన్నిసార్లు ముక్కు నుంచి నీరు కారుతుంది. తుమ్ములు, దగ్గు వస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్లు, చెవులు, దంతాల చుట్టూ నొప్పి, వాపు ఉండొచ్చు. ముక్కు వెనక భాగం నుంచి గొంతులోపలికి లిక్విడ్స్ విడుదలవుతాయి. దాంతో పొడి దగ్గు వస్తుంది. చాలామందికి ముఖమంతా నొప్పి పెడుతుంది. కొందరికి ముక్కు, కళ్ల దగ్గర వాపు కనిపిస్తుంది. కనుబొమల దగ్గర జివ్వుమని లాగుతుంది. సైనసైటిస్ ఎక్కువయ్యే కొద్దీ తలనొప్పి పెరుగుతుంటుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్లు, వయసు పైబడిన వాళ్లలో సైనస్ ఎక్కువగా వస్తుంటుంది. సైనస్ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌ను కలవాలి.
సైనసైటిస్‌తో బాధపడేవాళ్లు నాజల్ స్ప్రేలు వాడితే కొంత రిలీఫ్ ఉంటుంది. సైనస్ ఉన్నవాళ్లు చల్లని నీటితో స్నానం చేయకూడదు. చల్లటి పదార్ధాలు తినకూడదు. అలర్జీలు కలిగించే వాటికి దూరంగా ఉండాలి. పొల్యూషన్‌కు ఎక్స్‌పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. స్మోకింగ్ అలవాటు సైనస్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి స్మోకింగ్‌కు దూరంగా ఉండాలి. ఇంట్లో దుమ్ము, ధూళి లేకుండా చూసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ పెట్టుకోవాలి.
Sinus Symptoms,Sinus,Sinus Infection,Home Remedy,Health Tips
Sinus, Sinus Symptoms, Sinus Infection, sinus infection treatment, sinus infection home remedy, home remedy, Health, Health tips, health news, telugu news, telugu global news, సైనసైటిస్ చికిత్స, సైనసైటిస్ అంటే ఏమిటి, సైనసైటిస్ ముక్కు, సైనసైటిస్ సమస్య
https://www.teluguglobal.com//health-life-style/sinus-problems-home-treatments-remedies-and-tips-947401