సొంత కాంగ్రెస్ పార్టీ నేతలపై జగ్గారెడ్డి ఆగ్రహం

2024-12-12 11:39:36.0

సొంత కాంగ్రెస్ పార్టీ నేతలపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

సొంత పార్టీ నాయకులపై తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతు ఏఐసీసీ కార్యదర్శి విష్ణు, దీపాదాస్ మున్షి మీద మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో తనకు తెలియకుండనే నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. కొత్త వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చే విషయం ఫైనల్ అయ్యే వరకు తమకు సమాచారం ఇవ్వరా? అని ప్రశ్నించారు. పార్టీ కోసం పనిచేసిన వారిని.. ఎన్నికల్లో గెలిచేందుకు కృషి చేసిన వారిని ఎవరు పట్టించుకోవాలని అడిగారు. అసలు విష్ణు ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్నారా? వేరే రాష్ట్రం వెళ్లిపోయారా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

మెదక్‌ జిల్లా కూడా నేనే చూస్తున్నానన్న విష్ణు ఎక్కడికి వెళ్లారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. దీపాదాస్‌ కూడా తెలంగాణ రాష్ట్రానికే పనిచేస్తున్నారా? లేక వేరే రాష్ట్రం వెళ్లిపోయారా? అని రెచ్చిపోయారు. అధికార పార్టీ అంటే ఎలా ఉండాలి.. అసలు మీరేం చేస్తున్నారో అర్థం అవుతుందా? అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే.. ఇది కేవలం జగ్గారెడ్డి అభిప్రాయం మాత్రమేనా? పార్టీలో మరికొంత మంది కూడా ఇదే రకమైన అసంతృప్తిలో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి

Former MLA Jaggareddy,Congress party,CM Revanth reddy,Dipadas Munshi,AICC Secretary Vishnu,Deputy CM Bhatti Vikramarka,cabinet expansion,Rahul gandhi