2024-11-07 13:38:27.0
సోదాల పేరుతో మహిళా నేతలు ఉన్న గదుల్లోకి పోలీసులు ప్రవేశించడం సరికాదని ఏఐసీసీ అగ్రనాయకురాలు, వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
https://www.teluguglobal.com/h-upload/2024/11/07/1375741-priyaka-gandhi.webp
వయనాడ్‌లో సోదాల పేరుతో పార్టీ మహిళా నేతలు ఉన్న గదుల్లోకి పోలీసులు వెళ్లడం సరికాదని ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. దీంతో పలువురు కాంగ్రెస్ మహిళా నేతలు పాలక్కాడ్‌లో ఉంటున్నారు. ఓ కాంగ్రెస్ కార్యకర్త బ్యాగ్‌తో లోనికి వెళ్లారు. ఇది సీసీటీవీలో రికార్డ్ అయింది. నల్లధనాన్ని తీసుకువెళుతున్నారనే అనుమానాలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరపాలంటూ కేరళ ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో పోలీసులు హోటల్‌కు వెళ్లి.. సోదాలు నిర్వహించారు.ఈ ఘటనపై ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
సోదాల పేరుతో అర్ధరాత్రి సమయంలో మహిళలు ఉన్న గదుల్లోకి పోలీసులు వెళ్లడం తప్పు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. మరోవైపు, హోటల్ నుంచి నల్లధనం తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోందని బీజేపీ ఆరోపణలు చేస్తోంది. సోదాల పేరుతో మహిళా నేతలు ఉన్న గదుల్లోకి పోలీసులు వెళ్లడం తప్పంటూ కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ తప్పుబట్టారు. కేరళలో కల్పతి రథోత్సవం ఉత్సవాల సందర్భంగా పాలక్కాడ్‌లో జరగాల్సిన బైపోల్‌ను ఈసీ వాయిదా వేసింది. నవంబరు 20న ఎన్నిక జరగనుంది.
Priyanka Gandhi,Wayanad,Palakkad,Bipole,Congress women leaders,police,Rahul gandhi,Sonia gandhi,Congress party