సోమవారం ఆ స్కూళ్లకు సెలవు ఎందుకంటే?

2025-01-30 15:40:25.0

తెలంగాణలోని స్కూల్స్, కాలేజీలకు ఫిబ్రవరి 3న ఐచ్చిక సెలవు ఆప్షనల్ హాలిడే గా ప్రకటించింది

ఈ ఏడాది వసంత పంచమి ఫిబ్రవరి 3న వస్తోంది. ఆరోజు తెలంగాణ సర్కార్ ఆప్షనల్ హాలిడే గా ప్రకటించింది. హిందుత్వ, ఆద్యాత్మిక సంస్థల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లుకు సెలవు వుండనుంది. అటు ఏపీ ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ఇవ్వలేదు దీంతో ఆ రాష్ట్రంలో విద్యాసంస్ధలు యాథావిధంగా నడువనున్నాయి. చదువుల తల్లి ఆ సరస్వతి మాత జన్మించిన రోజును వసంత పంచమి లేదా శ్రీ పంచమిగా జరుపుకుంటారు హిందువులు. ప్రతి ఏడాది మాఘశుద్ద పంచమిని అమ్మవారి జన్మదినంగా నమ్మి ప్రత్యేక వేడుకలు జరుపుతుంటారు.

చిన్నాపెద్ద తేడాలేకుండా ఈ రోజున పుస్తకాలను పూజిస్తే జ్ఞానం లభిస్తుందని నమ్ముతారు.ఈ రోజున చిన్నపిల్లలతో అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. స్కూళ్లు, దేవాలయాల్లో సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తుంటారు. ఇక బాసర వంటి పుణ్యక్షేత్రాల్లో వసంత పంచమి రోజున తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు భారీగా తరలివస్తుంటారు. అమ్మవారిని దర్శించుకుని ఆమె సన్నిధిలో పలకబలపం పడితే మంచి జ్ఞానం లభిస్తుందని నమ్ముతారు.    

Vasanta pancami,Telangana Goverment,Optional holiday,Spiritual institutions,Educational institutions,CM Revanth reddy,CS Shanthikumari