2024-12-12 15:41:11.0
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
https://www.teluguglobal.com/h-upload/2024/12/12/1385365-1234.webp
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.సోషల్ మీడియా పోస్టులపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులతో ఇబ్బందులకు గురిచేసిన వారిపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ మీడియా పోస్టులపై కేబినెట్ సబ్ కమిటీ పై సీఎం చంద్రబాబు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ‘కొందరు నేరస్థులు రాజకీయ ముసుగులో ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఇష్టారీతిన పోస్టులు పెడుతున్నారు. వీటిపై నియంత్రణకు ఓ కమిటీని నియమించాలి. మంత్రులు లోకేష్, నాదెండ్ల మనోహర్, అనిత, సత్యకుమార్ యాదవ్‌లతో కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. శాంతి భద్రతలు అదుపులోకి వచ్చేలా ఈ కమిటీ నిర్ణయాలు తీసుకుంటుంది’ అని సీఎం తెలిపారు.