సౌథీకి చిక్కిన సర్ఫరాజ్‌ ఖాన్‌

https://www.teluguglobal.com/h-upload/2024/10/19/1370501-sarfaraz-kha.webp

2024-10-19 09:41:16.0

150 పరుగులు చేసి ఔట్‌

 

కివీస్‌ బౌలర్లకు చుక్కలు చూపించిన సర్ఫరాజ్‌ ఖాన్‌ ఎట్టకేలకు సౌథీకి చిక్కారు. 195 బాల్స్‌ లో 18 ఫోర్లు, మూడు సిక్సర్లతో 150 పరుగులు చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ సౌథీ బౌలింగ్‌ లో పటేల్‌ కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. నాలుగో రోజు ఆటలో ఇండియా జట్టు న్యూజిలాండ్‌ పై ఆల్‌ రౌండ్‌ ఆదిపత్యం కనబరిచింది. 52.3 ఓవర్లలో ఇండియా 250 పరుగులు చేసింది. నాలుగో వికెట్‌ కు రిషబ్‌ పంత్‌ తో కలిసి సర్ఫరాజ్‌ ఖాన్‌ 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. రిషబ్‌ పంత్‌ 96 పరుగులతో, కేఎల్‌ రాహుల్ ఆరు పరుగులతో క్రీజ్‌ లో ఉన్నారు. ఇండియా టీమ్‌ న్యూజిలాండ్‌ పై రెండో ఇన్నింగ్స్‌ లో 69 పరుగుల ఆదిక్యంలో ఉంది.