స్కాట్లాండ్‌పై తెలంగాణ బిడ్డ త్రిష రికార్డు సెంచరీ

https://www.teluguglobal.com/h-upload/2025/01/28/1398254-gongidi-trisha.webp

2025-01-28 08:30:51.0

మహిళల అండర్‌ 19 ప్రపంచకప్‌లో 53 బాల్స్‌ లోనే సెంచరీ చేసిన త్రిష

 

అండర్‌ 19 మహిళల ప్రపంచకప్‌లో తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష ప్రపంచ రికార్డు సృష్టించింది. మహిళల అండర్‌ 19 ప్రపంచకప్‌లో మొదటి సెంచరీ చేసింది. స్కాట్లాండ్‌ మహిళల జట్టుతో జరిగిన సూపర్‌ 6 మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది. దీంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 208 రన్స్‌ భారీ స్కోరు చేసింది. ఓపెనర్‌ కమిలిని (51) హాఫ్‌ సెంచరీ చేసింది. సానికా చల్కే (20 నాటౌట్‌) కూడా విలువైన ఇన్సింగ్‌ ఆడింది. 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 53 బాల్స్‌ లోనే సెంచరీ చేసిన త్రిష (110 నాటౌట్‌) ప్రపంచ రికార్డు నెలకొల్పింది.త్రిష స్వస్థలం తెలంగాణలోని భద్రాచలం.