https://www.teluguglobal.com/h-upload/2022/07/07/500x300_303047-download-36.webp
2022-05-10 09:08:20.0
డబ్బుని పొదుపు చేసే పద్ధతుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్, ఎల్‌ఐసీ లాంటి ఆప్షన్లు ఇప్పుడు అవుట్‌డేట్ అయిపోయాయి. ఈ జనరేషన్ యూత్‌కి వీటి గురించి అంతగా తెలీదు. కాస్త రిస్క్ ఉన్నా ఫర్వాలేదు. తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ కావాలని కోరుకుంటున్నారు వీళ్లు.
డబ్బుని పొదుపు చేసే పద్ధతుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్, ఎల్‌ఐసీ లాంటి ఆప్షన్లు ఇప్పుడు అవుట్‌డేట్ అయిపోయాయి. ఈ జనరేషన్ యూత్‌కి వీటి గురించి అంతగా తెలీదు. కాస్త రిస్క్ ఉన్నా ఫర్వాలేదు. తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ కావాలని కోరుకుంటున్నారు వీళ్లు. అందుకే రోజురోజుకీ స్టాక్స్‌లో పెట్టబడుల శాతం అమాంతం పెరుగుతుంది.
ఇప్పుడున్న యువత అంతా ఈక్విటీ, స్టాక్ మార్కెట్లలోనే పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడుతున్నారు. 2021, 22 ఆర్ధిక సంవత్సరంలో దేశంలోని “డీమ్యాట్” అకౌంట్ల సంఖ్య 63% పెరిగిందని గణాంకాలు చెప్తున్నాయి. ఇలా స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం మంచిదే అయినా సరైన అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టపోయే ప్రమాదముంది. అందుకే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు కొన్ని విషయాలు గమనించాలి అవేంటంటే..
స్టాక్ మార్కెట్‌లో లాభాలు మాత్రమే ఉంటాయని ఆశించి రావడం కరెక్ట్ కాదు. ఒక్కోసారి నష్టాలు కూడా రావొచ్చు. అందుకే స్టాక్ మార్కెట్ గురించి అవగాహన లేకుండా పెట్టుబడులు పెట్టకూడదు. అయితే అధిక రాబడి ఉండే ఈ పెట్టుబడుల గురించి ఆర్ధిక నిపుణుల సలహా తీసుకుని తక్కువ రిస్క్ ఉండే ఆప్షన్స్ ఎంచుకోవడం మేలు.
మార్కెట్లు ఒడుదొడుకుల గురించి అర్థం చేసుకోకుండా పెట్టుబడులు పెట్టకూడదు. ఎవరో చెప్పిన మాటలు విని అత్యాశకు పోతే నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. అందుకే పెట్టుబడులు ప్రారంభించే ముందే రకరకాల పెట్టుబడి సాధనాలు, రిస్క్ గురించి తెలుసుకోవడం అవసరం.
ఇకపోతే ఆర్థిక అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని దాని ప్రకారం పెట్టుబడులు పెట్టాలి. ఒక లక్ష్యం లేకుండా పెట్టుబడులు పెడితే లాభాల మోజులో పడి చివరకు నష్టపోయే ప్రమాదముంది. అందుకే పెట్టుబడులకు ఒక నిర్ధిష్టమైన లక్ష్యం ఉండాలి.
ఇకపోతే తక్కువ సమయంలో ఎక్కువ రిటర్న్స్ ఇస్తూనే రిస్క్ కూడా తక్కువ ఉండే మ్యూచువల్ ఫండ్స్ లాంటి ఆప్షన్స్ గురించి కూడా తెలుసుకోవాలి. షార్ట్ టర్మ్ పెట్టుబడులకు బదులు లాంగ్‌టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పడు రిస్క్ తక్కువగా, లాభం ఎక్కువగా ఉంటుంది.
Investing,Stocks,Stock Market Investment,Stock Market
Stock Market Investment, investing in stocks, Stock Market, martket news, market live news, how to invest in stock market
https://www.teluguglobal.com//2022/05/10/stock-market-know-these-before-investing-in-stocks/