2024-10-08 07:39:46.0
లాభాల్లో కొనసాగుతున్న బీఎస్‌ఈ, నిఫ్టీ
స్టాక్ మార్కెట్లకు హర్యానా ఎన్నికల ఫలితాలు జోష్ ఇచ్చాయి. హర్యానా, జమ్మూకశ్మీర్ లో ఇండియా కూటమి ఘన విజయం తథ్యమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో మంగళవారం ఉదయం స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా స్టార్ట్ అయ్యాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలకు భిన్నంగా హర్యానాలో బీజేపీ విజయం దిశగా దూసుకుపోతుండటంతో మార్కెట్లు ఆశజనకంగా కొనసాగతున్నాయి. బాంబే స్టాక్ మార్కెట్ లో సెన్సెక్స్ 300 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్, రిలయన్స్, అదానీ షేర్లు లాభాల బాటలో ఉన్నాయి. ఆటోమొబైల్, ఇన్సూరెన్స్, హెల్త్ సెక్టార్ షేర్లు నష్టాల బాటలో ఉన్నాయి.
stock markets,haryana election result,both markets on profits,bse,nifty