2024-10-30 08:39:38.0
పలువురు మృతి ..కొట్టుకుపోయిన వందలాది కార్లు
స్పెయిన్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీని కారణంగా పలువురు మృతి చెందగా అనేకమంది ఆచూకీ తెలియరాలేదని అధికారులు తెలిపారు. మరోవైపు వరదల్లో వందలాది కార్లు కొట్టుకుపోతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
స్పెయిన్‌లోని వాలెన్సియాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీనికారణంగా ఎంతోమంది మృతి చెందారు. ఇప్పటికే వారి మృతదేహాలను కనుగొన్నాం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ప్రభుత్వ అధికారి కార్లోస్ మజోన్ పేర్కొన్నారు. మరోవైపు దక్షిణ స్పెయిన్‌లోనూ భారీ వర్షాలు పడ్డాయి. దీంతో అక్కడి వీధులు బురద ఈ నీటితో నిండిపోయాయి. వరదల కారణంగా పలువురు తప్పిపోయినట్లు అధికార ప్రతినిధి పేర్కొన్నారు. గల్లంతైన వారి కోసం డ్రోన్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
Spain Floods,Several Killed,Heavy Rains,Flash Floods,Slam Spain