స్ప్రింట్ రన్నింగ్‌తో బరువు తగ్గడం ఈజీ!

https://www.teluguglobal.com/h-upload/2024/08/05/500x300_1350004-sprint-running.webp
2024-08-05 19:50:20.0

రోజూ వాకింగ్ చేసినా రిజల్ట్ ఉండట్లేదా? అయితే స్ప్రింట్ రన్నింగ్ ట్రై చేయాల్సిందే. చాలా త్వరగా క్యాలరీలు కరిగించే ఈ టెక్నిక్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

రోజూ వాకింగ్ చేసినా రిజల్ట్ ఉండట్లేదా? అయితే స్ప్రింట్ రన్నింగ్ ట్రై చేయాల్సిందే. చాలా త్వరగా క్యాలరీలు కరిగించే ఈ టెక్నిక్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎక్కువ క్యాలరీలు కరిగించాలంటే.. నడకతో ఆగిపోకూడదు. దాని వేగాన్ని పెంచాలి. శరీరంలో అదనంగా ఉన్న ఫ్యాట్‌ను కరిగించాలన్నా, శరీరాన్ని మరింత ఫ్లెక్సిబుల్‌గా మార్చాలన్నా నడక నుంచి రన్నింగ్‌కి షిఫ్ట్ అవ్వాల్సిందే. స్ప్రింట్ రన్నింగ్ ఎలా చేయాలంటే..

స్ప్రింట్ అంటే వేగంగా పరిగెత్తడం. రోజూ నడకను వ్యాయామంగా చేసే వాళ్లు శరీరంలో మరింత మార్పు కనిపించాలంటే నడక నుంచి రన్నింగ్‌కి మారాలి. అయితే నడక నుంచి రన్నింగ్‌కి షిఫ్ట్ అయ్యే ముందు కొన్ని జాగ్రత్తలు అవసరం. అనుకున్న వెంటనే రన్నింగ్ మొదలుపెడితే శరీరం తట్టుకోలేదు. దానికి కొంత ట్రైనింగ్ అవసరం. దాన్నే ‘స్ప్రింట్ ట్రైనింగ్’ అంటారు.

ఇలా చేయాలి

స్ప్రింట్ అంటే వేగమైన పరుగు అని అర్థం. అయితే దీన్ని ఇంటర్వెల్స్ తీసుకుంటూ చేయాలి. మొదటి స్ప్రింట్ ముప్పై సెకన్లు ఉండాలి. అంటే వామప్ , స్ట్రెచెస్ అయిపోయిన తరువాత ఒక స్ప్రింట్ చేయాలి. అంటే.. మీ శక్తినంతా ఉపయోగించి వీలైనంత వేగంగా పరిగెత్తాలి. అలా ముప్పై సెకన్ల పాటు చేస్తే చాలు. తర్వాత శరీరం చాలా అలసిపోతుంది. తర్వాత రెండు నిముషాలు రెస్ట్ తీసుకుని… బ్రీత్ నార్మల్ అయ్యాక మళ్లీ మరో స్ప్రింట్ చేయాలి. ఈ సారి ముప్పై నుంచి నలభై ఐదు సెకన్లకు పెంచినా పర్వాలేదు. మళ్లీ శరీరానికి కాస్త గ్యాప్ ఇచ్చి మరో సారి స్ప్రింట్ చేయాలి. ఇలా రోజుకి నాలుగైదు స్ప్రింట్స్ చేయెచ్చు.

జాగ్రత్తలు ఇలా..

అసలు వాకింగ్ కూడా అలవాటు లేని వాళ్లు డైరెక్ట్‌గా స్ప్రింట్ రన్నింగ్ చేయకూడదు. అలాంటి వాళ్లు ముందు వాకింగ్‌తో మొదలుపెట్టాలి. రోజూ వాకింగ్ చేస్తూ రోజురోజుకి నడక సమయం, నడక వేగం పెంచుకుంటూ పోవాలి. సుమారు ఒక నెలరోజుల పాటు ఇలా ప్రాక్టీస్ చేస్తే శరీరం నడకకు అలవాటు అవుతుంది. తర్వాత మెల్లగా నడక నుంచి జాగింగ్‌కి.. ఆ తర్వాత రన్నింగ్‌కి షిఫ్ట్ అవ్వాలి. స్ప్రింట్ రన్నింగ్ మొదలుపెట్టేముందు డాక్టర్ సలహా కూడా తీసుకుంటే మంచిది.

Sprint Running,Weight Loss Tips in Telugu,Weight Loss,Sprint
Sprint Running, weight loss, weight loss tips, weight loss tips telugu, telugu health news, Sprint

https://www.teluguglobal.com//health-life-style/sprint-running-for-weight-loss-and-improved-performance-1055727