స్వశక్తి మహిళలకు ఇచ్చే చీరలు పరిశీలన

2024-12-17 10:46:27.0

ముఖ్యమంత్రికి చూపించిన మంత్రి సీతక్క

https://www.teluguglobal.com/h-upload/2024/12/17/1386705-sarees-for-shg-women.webp

రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు అందజేసే చీరలను సీఎం రేవంత్‌ రెడ్డి పరిశీలించారు. అసెంబ్లీలోని సీఎం చాంబర్‌ లో మంత్రి సీతక్క ఎంపిక చేసిన చీరలను ముఖ్యమంత్రికి చూపించారు. రాష్ట్రంలోని 60 లక్షల మందికి పైగా స్వశక్తి మహిళలకు ప్రభుత్వం త్వరలోనే చీరలు పంపిణీ చేస్తుందని ప్రకటించారు. బతుకమ్మ చీరలకు బదులుగా స్వశక్తి సంఘాల్లోని మహిళలకు చీరలు అందజేయనున్నారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

CM Revanth Reddy,Sarees to SHG Women,Seethakka