స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ స్థలాలు, పార్కుల్లో హైడ్రా బోర్డులు

2025-01-27 17:11:35.0

సర్వే ఆఫ్‌ ఇండియా, ఎన్‌ఆర్‌ఎస్‌సీ శాటిటైల్‌ ఇమేజీలతో పాటు గ్రామాలకు చెందిన మ్యాప్‌లను పరిశీలించి ఎఫ్‌టీఎల్‌ పరిధిని నిర్ధారించాలన్నహైడ్రా కమిషనర్‌

అక్రమార్కుల నుంచి ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ స్థలాలు, పార్కుల ప్రదేశాల్లో హైడ్రా బోర్డులు ఏర్పాటు చేయాలని కమిషనర్‌ రంగనాథ్‌ అధికారులను ఆదేశించారు. 2024 జులై తర్వాత అనుమతి లేకుండా నిర్మిస్తున్న నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్వే ఆఫ్‌ ఇండియా, ఎన్‌ఆర్‌ఎస్‌సీ శాటిటైల్‌ ఇమేజీలతో పాటు గ్రామాలకు చెందిన మ్యాప్‌లను పరిశీలించి ఎఫ్‌టీఎల్‌ పరిధిని నిర్ధారించాలని రంగనాథ్‌ చెప్పారు.

అమీన్‌పూర్‌ చెరువు, దుర్గం చెరువు, మన్సూరాబాద్‌ పెద్ద చెరువు, మాసబ్‌ చెరువులను తక్షణమే పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.ప్రజావాణిలో భాగంగా ఔటర్‌ వరకు ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 78 ఫిర్యాదులు వచ్చాయని రంగానాథ్‌ తెలిపారు. స్థానిక అధికారుల నుంచి పూర్తి వివరాలు సేకరించి ఫిర్యాదుదారుల సమక్షంలోనే విచారణ చేయాలని ఆదేశించారు. నాలుగు వారాల్లో సమస్య పరిష్కారం కాకపోతే తానే స్వయంగా వచ్చి పరిస్థితిని సమీక్షిస్తానని రంగనాథ్‌ చెప్పారు. కబ్జాదారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

HYDRA boards,In seized Government lands,parks Places,Commissioner AV Ranganath,Orders officials