స్వామి వివేకానందకు సీఎం రేవంత్ నివాళి

2025-01-12 07:20:30.0

జాతీయ యువ‌జ‌న దినోత్స‌వం సందర్భంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు శుభాకాంక్షలు తెలిపారు

తెలుగు రాష్ట్రాల సీఎంలు స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. జాతీయ యువ‌జ‌న దినోత్స‌వం సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. “లేవండి.. మేల్కొండి.. గమ్యం చేరే వరకు విశ్రమించకండి” అన్న స్వామి వివేకానంద ప్రేరణాత్మక పిలుపు నేటికీ యువతకు స్ఫూర్తిదాయకం. నేడు స్వామి వివేకానంద జ‌యంతి సంద‌ర్భంగా నివాళుల‌ర్పిస్తూ యువ‌తీ యువ‌కులంద‌రికీ జాతీయ యువ‌జ‌న దినోత్స‌వ శుభాకాంక్ష‌లు’’ అంటూ జగన్ ట్వీట్‌ చేశారు.

CM Revanth Reddy,Jubilee Hills,Jagan Mohan Reddy,Youth Day,Telanagana goverment