2024-11-07 08:58:43.0
https://www.teluguglobal.com/h-upload/2024/11/07/1375606-janvi-kapoor.webp
జాన్వీతో సెల్ఫీలకు పోటీపడ్డ భక్తులు
జగదేకసుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ అమీర్‌పేట సమీపంలోని మధురానగర్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గురువారం ఉదయం ఆలయానికి వచ్చిన ఆమెతో అర్చకులు అరగంట పాటు పూజలు చేయించారు. ఆలయానికి జాన్వీ కపూర్ వచ్చిందని తెలుసుకున్న ఆమె అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అభిమానులతో పాటు భక్తులు ఆమెతో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. ఎన్టీఆర్ తో దేవర సినిమాలో అభిమానులను మెప్పించిన జాన్వీ కపూర్.. రామ్ చరణ్ సరసన నటిస్తోంది. షూటింగ్ బ్రేక్ లో ఆమె ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
Janvi Kapoor,Hanuman Temple,Devara,Ram Charan Movie,Ameerpet