హరిహరవీరమల్లు నుంచి పస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

 

2025-01-04 11:00:09.0

https://www.teluguglobal.com/h-upload/2025/01/04/1391560-pavan.webp

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహరవీరమల్లు సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహరవీరమల్లు సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ నెల 6న ఉదయం 9.06 గంటలకు అందులో ఫస్ట్ సింగిల్‌ను విడదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మాట వినాలి అనే సాంగ్‌ను స్వయంగా పవన్ ఆలపించడం విశేషం. జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్నా ఈ మూవీలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఈ మూవీని 2025 మార్చి 28న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించి 80 శాతం షూటింగ్ పూర్తయినట్టుగా తెలుస్తోంది. ఇక చెప్పినట్టుగానే ఈ సినిమాను 2025 మార్చ్ 28న రిలీజ్ చేయబోతున్నట్టు మరోసారి పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు.

ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయాలకు ఎక్కువగా సమయం కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కుదిరినప్పుడు సినిమాలకు కూడా డేట్స్ ఇస్తున్నారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “డేట్స్ ఇచ్చినా కూడా నిర్మాతలే వాడుకోలేదు” అని అన్నారు. అంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. మరో ఎనిమిది రోజులు టైం కేటాయిస్తే ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పూర్తవుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.

 

Hariharaveeramallu movie,Pawan Kalyan,Nidhi Agarwal,Director Jyoti Krishna,Janasena party,Mega fans,chiram jeevi,Ram charan