హరీశ్ రావును ఈ నెల 28 వరకు అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు

2025-01-10 15:28:09.0

మాజీమంత్రి హరీశ్ రావును అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది

తెలంగాణ హైకోర్టులో మాజీమంత్రి హరీశ్ రావుకు తాత్కాలిక ఊరట లభించింది. తనపై హైదరాబాద్ పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌ను గతంలో విచారించిన న్యాయస్థానం… హరీశ్ రావును అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. ఇవాళ మరోసారి ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయాలని ఫిర్యాదుదారు చక్రధర్ గౌడ్‌కు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.

అప్పటి వరకు హరీశ్ రావును అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో హరీశ్ రావుపై చక్రధర్ గౌడ్ పోటీ చేశారు. అయితే హరీశ్ రావు కక్షకట్టి తనను క్రిమినల్ కేసుల్లో ఇరికించారని, తన ఫోన్‌ను ట్యాప్ చేయించారని ఆరోపిస్తూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో హరీశ్ రావు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

Former Minister Harish Rao,Phone tapping case,Panjagutta Police Station,Chakradhar Goud,Siddipet Assembly Constituency,Assembly elections,BRS Party,KCR,KTR,CM Revanth reddy