2025-01-16 04:02:01.0
ఈ కంపెనీ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ వెల్లడి
అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలతో ఆ మధ్య భారత స్టాక్ మార్కెట్లను వణికించిన అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన నిర్ణయం తీసుకున్నది.ఈ కంపెనీ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ విడుదల చేశారు.’ఈ విషయం గురించి గత ఏడాది చివరి నుంచి నా కుటుంబం, స్నేహితులు, మా బృందంతో చర్చించాను. అనంతరం హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నా. దీనిపై మేం ఎంచుకున్న ప్రణాళికలు, ఐడియాలు ముగియడంతోనే ఈ నిర్ణం తీసుకోవాల్సి వచ్చింది. దీనివెనుక ఎలాంటి బెదిరింపులు, ఆరోగ్య కారణాలు, వ్యక్తిగత అంశాలు లేవు. విజయవంతమైన కెరీర్ ఏదో ఒకరోజు స్వార్థపూరిత చర్యలకు దారితీస్తుందని ఒకరు నాతో చెప్పారు. గతంలో నన్ను నేను నిరూంచుకోవాలని అనుకునేవాడిని. ఇప్పుడు నేను కంఫర్ట్జోన్లో ఉన్నానని అనిపిస్తున్నది. హిండెన్‌బర్గ్ నా జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే. కానీ జీవితానికి సరిపడా సాహసం చేసిన. ఎన్నోసవాల్లు, ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ చాలా ఉత్సాహంగా పనిచేశాం. ఇదంతా నాకో ప్రేమ కథలా అనిపిస్తున్నది’. అని అండర్సన్ ఆ లేఖలో రాసుకొచ్చారు. ఇక తన భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెడుతానని అన్నారు. తన బృందం మంచి స్థాయికి చేరుకోవడానికి సాయపడుతానని అన్నారు.
US-Based,Short Seller Hindenburg Research,Which Targeted Adani Group,To Be Disbanded,Nate Anderson said