2024-10-18 11:19:17.0
హిందీ మాసం వేడుకలపై ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ లేఖ రాశారు. చెన్నై దూరదర్శన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలతో పాటు హిందీ మాసోత్సవ వేడుకలను జరుపుకోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అని ఆయన తెలిపారు.
https://www.teluguglobal.com/h-upload/2024/10/18/1370278-ma-stalien.webp
హిందీ భాష వేడుకలపై తమిళనాడు సీఎం స్టాలిన్, ప్రధాని మోదీకి లేఖ రాశారు. చెన్నై దూరదర్శన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలతో పాటు హిందీ మాసోత్సవ వేడుకలను జరుపుకోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఆయన తెలిపారు. భారత రాజ్యాంగం ఏ భాషకు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. హిందీ భాషేతర రాష్ట్రాల్లో హిందీ మాసాన్ని జరుపుకోవడం ఎంటి..? అని ప్రశ్నించారు. ఇది ఇతర భాషల పట్ల చిన్న చూపు చూసే ప్రయత్నం లాంటిది అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే ఆయా రాష్ట్రాల స్థానిక భాషా మాస వేడుకలను కూడా జరుపుకోవాలని లేఖ లో స్టాలిన్ తెలిపారు . ప్రస్తుతం స్టాలిన్ లేఖ దేశంలో సంచలనంగా మారింది.
Tamil Nadu CM Stalin,PM Modi,Hindi language celebrations,Chennai,Doordarshan,Golden Jubilee Celebration